calender_icon.png 17 August, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం సమృద్ధికి అద్భుత ప్రయాణం

16-08-2025 12:00:00 AM

ఎస్బీఐ సీజీఎం రాధాకృష్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): హైదరాబాద్ కోటిలోని ఎస్బీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జాతీ య జెండాను హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఎస్ రాధాకృష్ణన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం కొరత నుంచి స్వయం సమృద్ధికి అద్భుతమైన ప్రయాణం చేసిందని చెప్పారు. దేశం ఇప్పుడు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసి ఆర్థిక స్థితిస్థాపకతను సాధించే దశకు చేరుకున్నామని చెప్పారు.

జాతి నిర్మాణంలో పౌర సంస్థలు పోషించిన కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు. వాటిలో అత్యంత ప్రభావవంతమైనదిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. పరిశ్రమ, సేవల నుండి విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వరకు ఎస్బీ భారతదేశ అభివృద్ధికి మూలస్తంభంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ లో ఎస్బీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి జిల్లాలో మార్కెట్ వాటాను 1శాతం పెంచేందుకు సీజీఎంలు, జీఎంలు, బీజీఎంలు, ఏజీఎం లు, ఉద్యోగ సంఘాల నాయకులు కృషి చేయాలని చెప్పారు.

ఉద్యోగులు దేశభక్తి గీతాలు ఆలపించారు. సాంప్రదాయ నృత్యా లు చేశారు. క్రీడలు, నృత్యం, విద్య అనేక ఇతర రంగాలలో రాణించిన సిబ్బంది, స భ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి రామకృష్ణ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎంసి, సిఎస్‌ఆర్), ఎస్బీ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు షెన్బాగా దేవి, (జనరల్ మేనేజర్ ఎన్‌డబ్ల్యూ-1), సతీష్ కుమార్ (జనరల్ మేనేజర్ ఎన్‌డబ్ల్యూ2), ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.