16-08-2025 12:00:00 AM
హాజరైన ఎమ్మెల్యే పలువురు ప్రముఖులు
ముషీరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం పంద్రాగస్టు వేడుకలను ఘనం గా జరుపుకున్నారు నియోజకవర్గంలోని రాంనగర్, గాంధీనగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్ పూర్, ముషీరాబాద్ డివిజన్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, యువ జన సంఘాలు, కుల సంఘాలు ప్రతినిధులు మువ్వన్నెల జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాంనగర్‌లో హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివా సం వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.
అదే విధంగా కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్లో స్కూల్ కరస్పాండెంట్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ స్వర్ణలతల ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు స్వీట్లు పంపిణీ చేశారు.