09-08-2025 03:17:36 AM
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు విడుదల చేసే బిల్లు ల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై బిల్లుల చెల్లింపులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను (ఆధార్ పేమెంట్ బిల్లు సిస్టం) చేపట్టనుం ది. విడతల వారీగా విడుదల చేస్తున్న బిల్లులు సకాంలో లబ్ధిదారులకు అందే లా చూడటంలో ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హౌసిం గ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
ఈ నిర్ణ యం వల్ల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వా రా చెల్లింపులు జరగడం లేదనే ఫిర్యాదులు తగ్గుతాయన్నారు. కాగా రాష్ట్ర వ్యా ప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు బిల్లులు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదన్న ఫిర్యాదులు రావడంతో హౌసిం గ్ శాఖ అధికారులు పరిశీలించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాల నమో దులో పొరపాట్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లో తప్పులు ఇతర కారణాలతో ఇబ్బందులు వస్తున్నాయని గమనించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపులు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరగడం లేదనే ఫిర్యాదులు తగ్గుతాయన్నారు.