calender_icon.png 9 August, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌భవన్‌లో రాఖీ ఫర్ సోల్జర్స్

09-08-2025 03:17:34 AM

రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాజ్‌భవన్‌లో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘రాఖీ ఫర్ సోల్జర్స్’ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళ అధికారులకు నగరంలోని వివిధ కళాశాలలకు చెంది న విద్యార్థినులు రాఖీలు కట్టారు. గవర్నర్ ర క్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. దే శ సరిహద్దుల్లో ఉన్నవారు మాత్రమే సైనికు లు కాదని, పారిశుద్ధ్య కార్మికుల నుంచి శాస్త్రవేత్తల వరకు వివిధ రంగాల్లో నిస్వార్థంగా సే వలందించే వ్యక్తులందూ సైనికులేనన్నారు.

దేశ సరిహద్దులను రక్షించడమే కాకుండా ధ ర్మం, సత్యం, రాజ్యాంగ సూత్రాల విలువల ను కూడా రక్షించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. రాఖీ పండుగ సోదరులుసోదరీమణుల పవిత్ర బంధాన్ని, వారికి అం డగా, రక్షణగా ఉంటామన్న విషయాన్ని తెలియజేస్తోందన్నారు. యువతలో దేశభక్తి విలువలను పెంపొందిస్తున్నందుకు సంస్కృతి ఫౌండేషన్‌ను ఆయన ప్రశంసించారు.