09-08-2025 03:19:27 AM
127 మంది ఏఈఈలకు సైతం డీఈఈలకు ప్రమోషన్
ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 46 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరితోపాటు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న 123 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు డిప్యూ టీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పిస్తూ శుక్రవారం నీటి పారు దల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారు పదిహేను రోజు ల్లో వారికి పోస్టింగ్ ఇచ్చిన స్థానంలో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఎస్‌ఎల్బీసీ టన్నెల్ మాగ్నెటిక్ జియోగ్రాఫికల్ సర్వేకు 2.36 కోట్లు
ఎస్‌ఎల్బీసీ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి హెలికాప్టర్ ద్వారా వీటీఈఎం ఫ్లస్ మాగ్నటిక్ జియోగ్రాఫికల్ సర్వే చేసేందుకు అవసరమైన రూ. 2.36 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం నిధులను విడుదల చేస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.