15-12-2025 10:43:00 PM
యథేచ్ఛగా ఆదివారం, సెలవుదినాలు చూసుకుని పనిచేస్తున్న నిర్మాణదారులు..
ఉప్పల్ (విజయక్రాంతి): కాప్రా మండల పరిధిలోని రాధిక దమ్మాయిగూడ ప్రధాన రహదారి గణేష్ టెంపుల్ దగ్గరలో నాలాకు ఆనుకుని అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించిన కాప్రా మండల ఎమ్మార్వో బైరెడ్డి రాజేష్ రెవెన్యూ అధికారులతో సందర్శించి ఇది ముమ్మాటికీ అక్రమ నిర్మాణమని తేల్చి పనులు ఆపాలని నిర్మాణదారుడిని హెచ్చరించి పనులు పూర్తిగా నిలిపివేసినా లెక్కచేయని భవన నిర్మాణదారులు, గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం సెలవు దినాలలో లేదంటే రాత్రిపూట, ఉదయం పూట పనులు కానిస్తున్న వైనం, వెంటనే అక్రమ నిర్మాణదారుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు, సోషల్ వర్కర్లు, స్థానికులు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, హైడ్రా అధికారులను డిమాండ్ చేస్తున్నారు.