calender_icon.png 16 December, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకుని అందరి హృదయాలను గెలుచుకున్న ఉప్పల్ పోలీసులు

15-12-2025 10:37:18 PM

ఉప్పల్ (విజయక్రాంతి): కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే మనిషిలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు.. కొంతమంది హృదయాల్లో బతికే ఉంది అనిపిస్తుంది. ఒక్క చిన్న పని కొన్ని వేల కోట్ల మంది హృదయాలను గెలుచుకుంటుంది. అటువంటి సంఘటన ఇది. నేటికీ మానవత్వం కొంతమంది రూపంలో బతికే ఉందని.. ఇంకా ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని సంతోష పడతాము. వివరాల్లోకెళ్తే.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో గత కొన్ని సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ విధులు నిర్వహిస్తున్న సులోచన భర్త రవీందర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ఇటీవల కాలంలో సులోచన భర్త రవీందర్ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వారి కుటుంబానికి అండగా నిలుస్తూ లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. దీంతో ఉప్పల్ పోలీసులు చేసిన పనికి స్థానికులు ప్రశంసలు కురిపించారు. మానవత్వంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఎంతో గొప్ప విషయం అని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.