26-11-2025 08:32:00 PM
మేడ్చల్ అర్బన్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో ఐఎన్టియుసి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. రాజ్యాంగం ప్రాముఖ్యత గురించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజు, రాజేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.