26-11-2025 08:27:42 PM
ఐ.ఐ.ఎఫ్.ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ తరఫున వితరణ..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ తిప్పాపూర్ ప్రాథమిక పాఠశాలలోనీ విద్యార్థులకు ఐ ఎఫ్ ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ తరుఫున పాఠశాల ప్రధానో పాధ్యాయులు హనుమయ్య ఆధ్వర్యంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ తరుపున డివిజనల్ మేనేజర్ కాజబాండే నవాజ్, ఏరియా మేనేజర్ రజినీకాంత్, వేములవాడ బ్రాంచ్ మేనేజర్ కొత్తూరి మహేష్, బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ బట్టు రాజు తో కలిసి విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి బ్యాగులు పంంపిణీ చేయటంలో సహకరించిన సంస్థ జోనల్ హెడ్ రామకృష్ణ, స్టేట్ హెడ్ రాంబాబు, హెచ్ఎర్ మేనేజర్ రాజులకు పాఠశాల హెచ్ఎం హనుమయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బ్రాంచ్ స్టాఫ్ ఇమ్మాన్యూల్, అచ్యుత్, శ్రీనివాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.