26-11-2025 08:39:36 PM
రంగాపురం సీపీఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కట్ట కళ్యాణి
గరిడేపల్లి (విజయక్రాంతి): నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న సిపిఐ పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు.మండలంలోని రంగాపురం గ్రామంలో సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన కోరారు.
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే నిత్యం ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న సిపిఐ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ఆయన కోరారు.స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశవాదులను అవినీతిపరులను ఓడించాలన్నారు.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న నాయకులని గెలిపించాలని ఆయన కోరారు.
ఆయా పార్టీల నాయకులు ఎన్నికలలో ఓడిన పదవీకాలం పూర్తి అయిన తర్వాత మళ్లీ ప్రజలకు కనపడరని అందుకే ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.రంగాపురం గ్రామపంచాయతీ సిపిఐ పార్టీ అభ్యర్థిగా కట్ట కళ్యాణి పోటీ చేయటానికి సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో సిపిఐ మండల పార్టీ కార్యదర్శి కడియాల అప్పయ్య,పోటు కృష్ణ బాబు,పోటు చింటూ,సిపిఐ గ్రామ కార్యదర్శి తిరగమల్ల కిరణ్,సిల్వ,అనిల్,పగడాల శ్రీను,రాజశేఖర్,బూర సతీష్,ఎల్లయ్య,ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు