calender_icon.png 26 November, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న జాతరలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

26-11-2025 08:30:26 PM

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గ్రామంలో గత రెండు రోజులుగా జరుగుతున్న మల్లన్న జాతరలో తాండూర్ మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖశాంతులతో.. పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆ మల్లన్న స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఆయనకు శాలువాతో సన్మానించారు.