calender_icon.png 26 November, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య పాఠశాలలో సామాజిక వారోత్సవాలు

26-11-2025 08:44:26 PM

మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల లక్ష్మీనగర్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో సామాజిక వారోత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం సామాజిక వారోత్సవాలలో భాగంగా ప్రాథమిక తరగతి విద్యార్థులు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. చిన్నారులు మన దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాల వస్త్రధారణని ప్రదర్శించి భారత దేశ ఐక్యత, గొప్పతనాన్ని చాటారు. మంచిర్యాల ప్రజలకు రాజ్యాంగ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి విద్యార్థులు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అయూబ్ మాట్లాడుతూ గణితం, సైన్స్ మాత్రమే కాకుండా విద్యార్థుల మనస్సును సామాజిక సేవల వైపు మళ్లించడానికి సోషల్ సబ్జెక్టు కూడా చాలా ముఖ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎమ్ అరవింద్ రెడ్డి, ప్రాథమిక సమన్వయకర్త జయశ్రీ, ఇంచార్జ్ అనగమాత, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.