calender_icon.png 26 November, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు నిర్లక్ష్యంతో నిలిచిన పత్తి కొనుగోలు

26-11-2025 08:29:11 PM

చండూరు (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి తంటాలు పడుతున్నారు. నాణ్యత, తేమ పేరుతో సిసి కేంద్రాలాల్లో పత్తిని కొనుగోళ్లు చేయకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారుల తెచ్చిన పత్తిని ఎలాంటి కోర్రిలు లేకుండా కొనుగోలు చేస్తున్న సి సి ఐ నిర్వాహకులు రైతులకు చెందిన పత్తి మాత్రం నాణ్యత పేరుతో కొనుగోలు చేయటం లేదని. రైతులు తెచ్చిన పత్తిని రంగు, తేమ శాతం పేరుతో తిరస్కరిస్తున్న.. కొనుగోలుదారులు అదే పత్తిని దళారులు తీసుకుపోతే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 

పత్తి కొనుగోలు చేయాలని చండూరు మండలం బంగారిగడ్డ మంజిత్ కాటన్ మిల్లు వద్ద రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. మంగళవారం స్లాట్ బుక్ చేసుకోని పత్తి తీసుకురాగా నాణ్యత లేదని పదిమంది రైతులకు చెందిన పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. బుధవారం కూడా వారి పత్తి కొనుగోలుకు అధికారులు ఒప్పుకోకపోగా, బుధవారం పత్తి తీసుకవచ్చిన రైతులకు చెందిన పత్తి తేమ అధికారులు పరిశీలించకపోవటంతో రైతులు ఆందోళన చేపట్టారు. వాతావరణ పరిస్థితుల కారణంగా రంగు మారిన పత్తిని అధికారులు కొనుగోలు చేయాలని, స్లాట్ బుకింగ్ రోజే పత్తి కొనుగోళ్లు చేయాలనీ లేకపోతే రైతులకు అది ఆర్థిక భారంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని పత్తిని ధర తగ్గించి కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.