16 August, 2026 | 12:46 AM

అమీర్ లోగ్.. హైదరాబాదీ వైబ్

16-08-2026 12:00 AM

ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్‌రెడ్డి, సాయియోగి కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అమీర్ లోగ్’. రమణారెడ్డి సోమ దర్శకుడు. మాధవిరెడ్డి సోమ నిర్మాత. తెలుగులో ఆగస్టు 21న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకలో “లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’ చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. ‘ఫలక్ నుమా దాస్’ రేంజ్‌లో విజయం సాధిస్తుందనిపిస్తోంది” అన్నారు.

నటుడు ఎంసీ హరి మాట్లాడుతూ.. “నేను బస్తీలో పుట్టి పెరిగాను. ఇప్పుడు ఓ బస్తీ సినిమాతోనే వస్తున్నా” అని తెలిపారు. నటుడు మనోజ్ మాట్లాడుతూ.. “మేం ఈ చిత్రంతో అందరినీ నవ్విస్తాం, ఏడిపిస్తాం” అని చెప్పారు. నటుడు శశిధర్ మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’ టీజర్, ట్రైలర్, పాటలు ఎంత బాగున్నాయో.. సినిమా కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుంది” అని తెలిపారు.

వేద జలంధర్ మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’ చిత్రంలో నేను పోషించిన గీత పాత్ర అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఓ శక్తిమంతమైన మహిళ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది” అని అన్నది. నటుడు విశ్వేందర్‌రెడ్డి మాట్లాడతూ.. “అమీర్ లోగ్’ సినిమా హైదరాబాద్ సోల్‌ను చూపిస్తుంది” అని చెప్పారు. దర్శకుడు రమణరెడ్డి, నిర్మాత మాధవిరెడ్డి సోమ తదితరులు కూడా మాట్లాడారు.