మాకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కావాలి
మేఘాంశ్ శ్రీహరి హీరోగా దర్శకుడు రామ్‌నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాను శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేశ్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఇందులో రాయంచ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీహరి జయంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో శాంతి శ్రీహరి మాట్లాడుతూ.. “ఈ సినిమాతో మేఘాంశ్‌కు మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నా.
ఇప్పటికీ మేఘాంశ్‌ను చిన్న పిల్లాడిలానే చూస్తుంటా. కానీ, ఈరోజు పోస్టర్ చూసిన తర్వాత సింహాన్ని చూసినట్టనిపించింది” అన్నారు. “ఆస్మాన్’ సెట్‌లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది” అని హీరో మేఘాంశ్ శ్రీహరి అన్నారు. హీరోయిన్ రాయంచ మాట్లాడుతూ.. “మాకు ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలు కావాలి” అని తెలిపింది.






