11-11-2025 09:33:37 PM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..
సూర్యాపేట (విజయక్రాంతి): విద్య ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కృషి చేశారని జిల్లా కలెక్టర్ తేజేస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 137 వ జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి ఆజాద్ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా, స్వతంత్ర సమరయోధుడుగా సేవలందించారన్నారు.
అలాగే ముస్లిం కమ్యూనిటీలో సాంఘిక సంస్కరణల కోసం కృషి చేశారని, అన్ని రంగాలలో ముస్లింలకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుకున్నారన్నారు. ఆయన ఆశేషాలను ప్రతి ఒక్కరికి కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ ,పలువురు మైనార్టీ పెద్దలు కలీం అహ్మద్,అబూబాకర్ సిద్ధికి, అంజద్ అలీ, మత పెద్ద అక్తర్ మౌలానా, తెలంగాణ మైనారిటీస్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షేక్ బడే సాబ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శంకర్, డి టి ఓ రవి కుమార్, డి డబ్ల్యూ ఓ నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.