11-11-2025 09:31:43 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి జె. భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యాన అధికారి శ్రీ. పి.కమలాకర్ రెడ్డి, వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ. కె.రణదిర్ రెడ్డి, వ్యవసాయ అధికారి కె. సంతోష్ కుమార్, ఉద్యాన అధికారి వి.ఐలయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేంద్రప్రసాద్ సంయుక్తంగా కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్ గ్రామములో సిరిపురం పర్శరాములు రెండు ఎకరాలలో సాగుచేస్తున్న ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా కంది పంట సాగును పరిశీలించారు. ఆయిల్ పామ్ తోటలో కంది అంతర పంటగా మంచి పెరుగుదల, పూత రావడం జరిగింది. కంది పంట చాల లభాధాయకమంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సహం ఎక్కువగా ఉంది. ఒక్క ఎకర ఆయిల్ పామ్ సాగుకు రూ/- 4200/- ఒక్క సంవత్సరానికి చొప్పున నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని, ఒక్క రైతుకు ఎన్ని ఎకారలైన సాగు చెయ్యవచ్చునని, మార్కెటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన జిల్లాకు లోహియ ఎడిబల్ ఆయిల్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపనీ కేటాయించడం జరిగింది. వీరు రైతులకు మొక్కలు సప్లయ్ చెయ్యడం, పర్యవేక్షించడం, గెలల కొనుగోలు చెయ్యడం, 14 రోజుల లోపు డబ్బులు చెల్లించడం చేస్తారు. కావున రైతు సోదరులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ చేపట్టి అధిక లాభాలు ఆర్జించాలని అధికారులు రైతులకు సూచించారు.