25-09-2025 01:13:52 AM
సీఎం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): అవినీతి నిరోధక శాఖ (అనిశా) కేసులను త్వరగా విచారించి శిక్షలు పడేలా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు బుధవారం సీఎం రేవం త్‌రెడ్డికు ఆయన లేఖ రాశారు.
అవినీతి నిరోధకశాఖ కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. కేసులను సచివాలయంలోని సంబంధిత శాఖలో చాలా కాలం వరకు పెండింగులో ఉంచడం, సదరు అధికారిని ప్రాసిక్యూట్ చేయకుండా శాఖాపరమైన విచారణ, కమిషనర్ ఆఫ్ ఎంక్వురై లేదా ట్రిబ్యునల్‌కు పంపడంతో కేసులు నీరుగారి పోతున్నాయని సీఎంను ఆయన లేఖలో కోరారు.