24-01-2026 12:00:00 AM
సాదా బైనామా రిజిస్ట్రేషన్ కోసం రూ.2 లక్షలు లంచం డిమాండ్
ఆదిలాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఓ అవినీతి ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బజార్‌హత్నూర్ తహసీ ల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కట్కం విద్యాసాగర్‌రెడ్డి ఓ వ్యక్తికి సంబంధించిన బలాన్పూర్ శివార్ పరిధిలోని 8.35 ఎకరాల భూమికి సంబంధించిన సాదాబైనామా రిజిస్ట్రేషన్ ఫైల్‌ను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.