24-01-2026 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్, జనవరి 23 : అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయా లని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టంపేట ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అభివృద్ధి పనులు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు.
అనంతరం మండల కేంద్రంలో నిర్మితమవుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.