25-01-2026 12:00:00 AM
కామారెడ్డి, జనవరి 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు 11 గంటల పాటు సివిల్ సప్లయ్ కా ర్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం 10 గంటలకు కార్యాలయంలోకి సివిల్ డ్రెస్ లో వచ్చిన అధికారులు కలెక్టర్‌లోని కార్యాలయాల వద్ద నిఘా పెట్టారు.
సివిల్ సప్లయ్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సీఐ, ఎస్‌ఐలుసోదాల్లో పాల్గొన్నారు. సివిల్ సప్లయ్ అధికా రులు, సిబ్బందిని తనిఖీల్లో పలుసార్లు ప్రశ్నించారు. రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు, మిల్లర్లు తిరిగి బియ్యాన్ని ఎన్ని మిల్లులు ఇచ్చాయి, ఎన్ని మిల్లుల వారు ఇవ్వలేదు, ఎంత క్వాంటిటీ బకాయి ఉన్నా రు, అనే కోణంలో సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన ఏసీబీ బృందం కార్యాల యాల్లో ఉన్న ఫైళ్లను తనిఖీలు చేపట్టారు.రైస్ మిల్ యజమానుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లే కొంతమంది రైస్ మిల్లర్లు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది.
పూర్తి డాటాను సేకరించిన ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చినట్లు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు తనిఖీలు చేసే వరకు సిబ్బందిని అధికారులను బయటకు వెళ్ళనివ్వలేదు. రాత్రి వరకు కూడా కుర్చీలకే పరిమితమే సిబ్బంది కూర్చున్నారు. రైస్ మిల్లర్లకు ఎవరెవరు సిబ్బంది సహకరించారు అధికారులు సహకరించారు అని కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లాలోని రైస్ మిల్ యజమానుల మధ్య విభేదాలు కూడా చూపినట్లు తెలుస్తుంది. గత సంవత్సరం నూతన పాలకవర్గం ఏర్పాటు చేసినప్పుడు ఎన్నికలకు వెళ్లిన రైస్ మిల్ యజమానులు జిల్లా అధ్యక్షులు ఎంపికతో పాటు పాలకవర్గం ఎంపికలోనూ సఖ్యతతో చేయకుండా విభేదాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వేలు పడ్డాయి. ఏడాదికాలంగా రైస్ మిల్లర్స్ నూ తన పాలకవర్గానికి సహకరించలేదని కు అపవాదు కూడా ఉంది. కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్ వ్యాపారుల మధ్య పొడ చూపిన భేదాభిప్రాయాల వల్లే ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం పూర్తి వివరాలు అధికారులు వెల్లడించారు.