calender_icon.png 25 January, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పారామంలో హ్యాండీ క్రాఫ్ట్ మేళా

25-01-2026 12:00:44 AM

ఆకట్టున్న చిన్నారుల నృత్యాలు

శేరిలింగంపల్లి, జనవరి 24 (విజయక్రాంతి): శిల్పారామం మాదాపూర్‌లో ఛత్తీస్ గఢ్ గాంధీ శిల్ప బజార్ హ్యాండీక్రాఫ్ట్స్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా, శనివారం ప్రి యాంక వేముల రాధికా శిష్య బృందం కూచిపూడి నృత్యాలు ప్రత్యేకంగా నిలిచాయి. వీటిలో పుష్పాంజలి, శ్రీ గణపతిని, మూషిక, దేవి నీయతున్నాయి, రామ కోదండరామ, గంధము పూయరుగా, తులసీదళములతో రామచంద్రయ్య వంటి అంశాలను సింధు, శాన్వి, సాక్షి, శ్రీజ, అమేయ, మీను అనన్య మొదలైన కళాకారులు ప్రదర్శించారు. అనంతరం వేముల రాధికా శిష్య బృందం విగ్నేశ్వర కీర్తన.భామాకలాపం, శరణు సిద్ధి, దశావతర తరంగం, మామవతు శ్రీ సరస్వతి, శివ పంచాక్షరీ, శివ తరంగం, రామా యణ శబ్దం కృతిక, అనైనా, సాన్విక,కాత్యాయని, సహస్ర, అద్వికా మొదలైన వారు ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు.