16-11-2025 12:43:45 AM
భద్రాచలంలో జెన్ జాతీయ గౌరవ దివస్
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 15 (విజయక్రాంతి): ఆదివాసీ గిరిజనుల హక్కుల సిం హగర్జన ‘బిర్సా ముండా’ అని, గిరిజనుల కోసం చిన్నతనంలోనే ఆంగ్లేయులతో పోరాడిన మహోన్నత వ్యక్తి అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నా రు. బిర్సా ముండా మనకు నేర్పింది అణచివేతకు లొంగొద్దు, స్వాభిమానాన్ని రక్షించు, సంస్కృతిని కాపాడు, హక్కుల కోసం గళం విప్పు, ఐక్యతే శక్తి అని అని చెప్పారు.
శనివా రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ని ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనం లో రాష్ట్రస్థాయి జెన్ జాతీయ గౌరవ దివస్, 150 జయంతి వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. బిర్సా ముండా 15 నవంబర్ 1875 - ఉళిహాతు గ్రామం, జార్ఖండ్ (అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ)లో జన్మించాడని చెప్పారు. గిరిజన తెగకు చెందిన సాధారణ కుటుంబంలో జన్మించిన బిర్సా, చిన్న వయసులోనే అసాధారణ నాయకత్వ లక్షణాలు చూపించాడని, గిరిజనులు ఆయనను ‘ధర్తి అబ్బా‘ (భూమాత తండ్రి)గా, రక్షకుడిగా గౌరవించారని చెప్పారు.
”బిర్పాయిల్’ అనే కొత్త సంస్కృతి-భక్తి-సామాజిక ఉద్యమాన్ని స్థాపించి గిరిపోరాట సంఘాలన్నింటిని ఏకం చేశారన్నారు. బిర్సా ముండా నాయకత్వంలో బ్రిటిష్ వలస పాలనను కుదిపేసిన ‘ఉలుగులాన్ మహా గర్జన ఇది కేవలం తిరుగుబాటు కాదని, భూమి హక్కులు, సంస్కృతి, స్వేచ్ఛ, గిరిజన గౌరవాన్ని కాపాడేందుకు సాగిన పవి త్ర విప్లవమని అన్నారు. మనభూమి మనదే మన స్వేచ్ఛ మన హక్కు బిర్ష నినాదమని, బ్రిటిష్ బూకబ్జాలను ఎదిరిస్తూ, భూమిపై గిరిజనుల సొంత హక్కును ప్రపంచానికి వినిపిం చాడని అన్నారు.
బ్రిటిష్ అధికారులు 1900 సంవత్సరంలో అరెస్టు చేశారని, కేవలం 25 ఏళ్ల వయసులోనే రాంచి జైల్లో ఆయన అమరుడు అయ్యాడని గుర్తు చేశారు. అంతర్జాతీ య స్థాయిలో గుర్తింపు బిర్సా ముండా పేరు నేడు భారతదేశానికే కాదు ప్రపంచ స్వదేశీ ఉద్యమాలకు ధైర్యం ఇచ్చే చిహ్నంగా నిలిచిందని అన్నారు. గిరిజన సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో గర్వించదగ్గ పురోగతి సాధించిందని,
రాష్ట్రంలో 2145 గిరిజన విద్యా సంస్థలు, 1.5 లక్షల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 95.66%, 275 పాఠశాలల్లో 100% రిజల్ట్ సాధించినట్లు తెలిపారు. ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలల్లో పదవ తరగతిలో 99.92 శాతం ఫలితాలు సాధించి జాతీయస్థాయిలో అగ్రగామియ నిలిచాయని, గిరిజన పిల్లలు జేఈఈ, నీట్, ఐఐఐటి, క్లాట్,ఎన్డీఏ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో ప్రతిభ కనపరుస్తున్నారని అన్నారు.
అలాగే 1.31 లక్షల విద్యా ర్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నామని, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 400 మంది గిరిజన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు తోడ్పాటు అందిస్తున్నామని, కళ్యాణ లక్ష్మి పథ కం ద్వారా 39, 470 కుటుంబాలకు మద్దతు ఇస్తున్నామన్నారు. 6.7 లక్షల ఎకరాలకు పోడు హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నామని, అలాగే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభందించిన జోడేఘాట్, మేడారం, భద్రాచలం వంటి కేంద్రాల్లో మ్యూజియంల అభివృద్ధి, గిరిజన జాతరలకు సాంప్రదాయ కళలకు భాషలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
అనంతరం నీట్, జేఈఈలో ఉత్తమ ఫలితాలు సాధించి వేరువేరు చోట్ల చదువుతున్న విద్యార్థులకు లాప్‌టాప్‌లు అందించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బల రాం నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, గిరిజన సంక్షేమ అడి షనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, టిసిఆర్‌టిఐ డైరెక్టర్ సమజ్వాల, అసిస్టెంట్ డైరెక్టర్ పివి పద్మ, జిఎం శంకర్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటిడిఏ పిఓ బి రాహుల్ పాల్గొన్నారు.