23-08-2025 01:23:32 AM
ప్రజలకు 10 వేల విత్తన గణేశ్ పెట్టెల పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి): ప్రజలకు ఆరోగ్యకరమైన కుకింగ్ ఆయిల్‌ను అందిస్తున్న ఫ్రీడమ్స్ ఆయిల్స్.. పర్యావరణ పరిరక్షణలో మరో ముందడుగు వేసింది. జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) ఆధ్వర్యంలో గణేశ్ చతుర్థిని ఈ ఏడాది పది వేల పర్యావరణ అనుకూల విత్తన గణేశ్ పెట్టెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
పర్యావరణ అనుకూల విధానా లను ప్రోత్సహించడానికి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ హైదరాబాద్‌లో 5 వేలు, బెంగళూరులో 5 వేల పర్యావరణ అనుకూల విత్తన గణేశ పెట్టెలను పంపిణీ చేయనుంది. నగరంలోని రిడ్జ్ టవర్స్, మై హోమ్ జ్యువెల్, వన్ సిటీ, సాయి మిత్రా టవర్స్, కృష్ణకుంజ్ గార్డినియా, మలేషియన్ టౌన్‌షిప్స్ రెయిన్ ట్రీ పార్క్, స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్స్, రెయిన్‌బో విస్టా,
జనప్రియ మెట్రోపోలిస్ అపార్ట్ మెంట్స్, శాటిలైట్ అపార్ట్‌మెంట్, వెర్టెక్స్ ప్రైమ్, రెయిన్‌బో విస్టాస్ రాక్ గార్డెన్-1, 2 మొదలైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు పర్యావరణ అనుకూల విత్తన గణేశుడిని పంపిణీ చేయడానికి సిద్ధమైన వాహనాలను ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయి ల్స్ మార్కెటింగ్ డీజీఎం చేతన్ పింపాల్‌ఖుటే జెండా ఊపి ప్రారంభించారు.
గణేశ్ పండుగ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించటానికి, ప్రజలు మట్టి, నీటిలో కరిగే గణేష్ మూర్తిని ఎరువు, మొక్కలకు అనువైన విత్తనాలతో చేయటం ప్రారం భించారు. నిమజ్జనం తర్వాత, గణేష్‌మూర్తి లోపలి విత్తనం మొక్కగా పెరుగుతుం ది. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీ చంద్రశేఖ రరెడ్డి మాట్లాడుతూ.. పర్యవరణ పరిరక్షణే ధ్యేయంగా పదివేల విత్తన గణేశ మూర్తులను పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.