calender_icon.png 25 May, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

24-05-2025 10:12:36 PM

వ్యవసాయ అధికారిణి నాగమాధురి..

పాపన్నపేట: వ్యాపారులు అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాపన్నపేట మండల వ్యవసాయ అధికారిణి నాగమాధురి పేర్కొన్నారు. శనివారం పాపన్నపేట మండల కేంద్రంలో పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వానాకాలం సీజన్ ప్రారంభం దృష్ట్యా వ్యాపారస్తులు అనుమతి లేని నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రైతులు కొనుగోలు చేసిన ఎరువులు విత్తనాలకు సంబందించి విధిగా రసీదును ఇవ్వాలన్నారు. ఎట్టి పరిస్థితిలో లూజ్ విత్తనాలు విక్రయించరాదని తెలిపారు. రైతులు కూడా ప్రభుత్వం ధ్రువీకరించిన నీలం లేదా ఆకుపచ్చ రంగు ట్యాగ్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ జనార్ధన్, పాపన్నపేట మండల విత్తన డీలర్లు పాల్గొన్నారు.