24-05-2025 09:54:20 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): అల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను ఛీబ్ జి, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ ఖాలిద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డిలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో శనివారం హైదారాబాద్ కి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానం పలకడం జరిగిందని యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధం శశికాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అలాగే యూత్ కాంగ్రెస్ బలోపేతం చేయడానికి కావలసిన అంశాలపై చర్చించడం జరిగిందన్నారు.