24-05-2025 10:19:24 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నల్లా నారాయణరెడ్డి(Dr. Nalla Narayana Reddy)ని శనివారం ఏరియా హాస్పిటల్ లో వివిధ సంఘాల ప్రతినిధులు సత్కరించారు. నారాయణరెడ్డి సేవా దృక్పథం ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పివీ సేవా సమితి అధ్యక్షుడు తుము వెంకటరెడ్డి, ఐఎంఏ డాక్టర్ రామలింగారెడ్డి, మాసాడి ముత్యంరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.