calender_icon.png 25 May, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిసెట్ లో స్టేట్ 3వ ర్యాంకుతో జయ ప్రభంజనం

24-05-2025 10:09:17 PM

కోదాడ: పాలిసెట్ లో స్టేట్ మూడో ర్యాంకుతో జయ ప్రభంజనం సృష్టించిందని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్(School Correspondent Jaya Venugopal) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పరీక్ష యందు జయ స్కూల్ కోదాడకు చెందిన ఎస్కె ఇఫ్రా తస్నీమ్ రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించామని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకు సాధించిన విద్యార్థినిని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మలు, హెచ్ ఎమ్ చిలువేరు వేణు అభినందించారు. పాఠశాల స్థాయిలో జరిగే అత్యుత్తమ షౌండేషన్ విద్య ద్వారా అన్ని పోటీ పరీక్షలలో విజయం సాధించగలుగుతున్నారని కరస్పాండెంట్ తెలిపారు. ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.