24-05-2025 09:57:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యార్థినిలు మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు షీ టీం మహిళా సభ్యులు పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా ఫిర్యాదు చేయండి. నారాయణ స్కూల్ లో పోక్సొ చట్టాల మీద, చైల్డ్ మ్యారేజ్, జువెనైల్ చట్టాల మీద గంజా గస్తి ప్రోగ్రామ్ మీద గవర్మెంట్ టీచర్స్ కి అవగాహన కల్పించి, వాళ్ళు పిల్లలకు అవగాహన కల్పించే విధంగా షీ టీం ఎస్ఐ బిట్ల పెర్సిస్ అవాగాహన కల్పించడం జరిగింది. నిర్మల్ లో గంజా పూర్తిగా రూపుమపడానికి ప్రతి ఒక్క టీచర్ తమవంతు సహకారం చేస్తూ సమాచారం ఉన్న లేదా తమ వద్ద చదువుకునే పిల్లల నడవిడక అనుమానాస్పదంగా ఉంటే వెంటనే 8712659599 అనే నంబర్ కి సమాచారం అందించగలరని అని తెల్పినారు. మహిళలు వేధింపులకు గురైనట్లు అయితే షీ టీమ్ నెంబర్ 8712659550 లేదా డయల్ 100 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు.
మహిళల, విద్యార్థినిల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, మహిళ భద్రతయే పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత అని,విద్యార్థిని విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోనెటట్లు ప్రోత్సాహించమని జిల్లా షీ టీం అధికారి ఎస్ఐ పెర్సిస్ ఈ రోజు నిర్మల్ పట్టణం లోని నారాయణ స్కూల్ లో షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మహిళ రక్షణ, షీ టీమ్స్,ఈవ్ టీజింగ్ ,పొక్సో ,సైబర్ క్రైమ్స్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో పెర్సిస్ ఎస్ఐ, షి టీం సిబ్బంది, గవర్నమెంట్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సుమారు 200 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.