24-05-2025 09:50:00 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... బల్కంపేటకు చెందిన జారీ కమల్ బ్యాండ్ సిబ్బంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. సౌండ్ పొల్యూషన్ కేసులో బ్యాండ్ బాజా వారి వాహనాన్ని, సామాగ్రిని ఎస్ఐ శంకర్ సీజ్ చేశారు. వాహనాన్ని, సామాగ్రిని తిరిగి ఇంచేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు.
జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్ అనే వ్యక్తిని మధ్యవర్తికి పెట్టుకొని ఎస్ఐ డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వాలని బాధితులకు తెలిపారు. ఎస్ఐ శంకర్ బెదిరింపులను బారించలేక బాధితుడు ఏసీబీసీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగ్గిన అధికారులు మధ్యవర్తి నాగేందర్ కు ఇచ్చిన రూ.15వేల మొత్తాన్ని ఎస్ఐ శంకర్ అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధ్యత గల అధికారంలో ఉండి అవినీతికి పాల్పడిన ఎస్ఐతో పాటు మధ్యవర్తి నాగేందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.