calender_icon.png 25 May, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ముగింపు

24-05-2025 10:25:52 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల పెద్ద కొడప్గల్ లో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం నేటితో దిగ్విజయంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి నైపుణ్యాలను, అంశాలను ప్రతి పాఠశాలలో అమలుపరచాలి. అదేవిధంగా విద్యార్థులలో నైపుణ్యాలను మరింత పెంచవలసిందిగా ఎంఈఓ ప్రవీణ్ కుమార్(MEO Praveen Kumar) తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కిషోర్ రీసోర్స్ పర్సన్స్ లింగం, బక్షిరామ్, కళ్యాణ్, మహేష్, మారుతి, నరేష్, ఉపాధ్యాయులు, సిఆర్పిలు గోపాల్, రాములు తదితరులు పాల్గొన్నారు