calender_icon.png 25 May, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గు వెంకటాపురంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ

24-05-2025 09:52:24 PM

కల్లూరు (విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్(MLA Dr. Matta Ragamayee Dayanand) అన్నారు. శనివారం కల్లూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మొత్తం 756 మంది లబ్ధిదారులను గుర్తించగా వారిలో ముగ్గు వెంకటపురం గ్రామం నుండి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపికైన వారి జాబితాను పంచాయితీ కార్యదర్శి ఫైనల్ చెయ్యగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 

పేదింటి ప్రజలు 10 సంవత్సరాలు  నిరీక్షణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సొంత ఇంటి కల నెరవేర్చడానికి ఇందరమ్మ పట్టాలు పంపిణి కార్యక్రమం కార్యక్రమం  నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, రెవిన్యూ డివిజినల్ అధికారి రాజేందర్ గౌడ్, తహసీల్దార్ పులి సాంబ శివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంపీవో రంజిత్, గ్రామం కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ రావి పాపరావు,కల్లేపల్లి రమేష్, చింతకాయల పుల్లారావు,రాయల సరోజన్ రావు తదితర కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.