22-07-2025 12:00:00 AM
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంచర్ల
నల్లగొండ క్రైమ్, జూలై 21 : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు నల్గొండ మండలం అన్నారెడ్డి గూడెం బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు బార్య కుమారుడుతో కలిసి బైక్ పై వ్యవసాయ బావి వద్దకు వెళుతుండగా ముందు జాగ్రత్త చర్యలు పాటించకుండా రోడ్డు వెంట చెట్లను కొడుతున్న క్రమంలో విద్యుత్ స్తంభం విని బైక్ పై వెళ్తున్న వారిపై పడింది దీంతో వారు గాయాలు తగిలాయి చికిత్స పొందుతున్న హాస్పిటల్ లో కుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించారు.
ప్రమాదo జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు తన భార్య మంజుల కుమారుడు హర్షవర్ధన్ తో కలిసి పొలానికి బండిమీద వెళుతుండగా అన్నారెడ్డి గూడెం గ్రామ శివారులో విద్యుత్ అధికారులు చెట్లు కొట్టుతున్నారు. అందులో ఒక చెట్టు విద్యుత్ స్తంభంపై విరిగిపడి.. అదే దారిలో ప్రయాణిస్తున్న తమపై పడిందని.. అదృష్టవశాత్తు తాను తన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డా మని తమ కుమారునికి.. తలకు బలమైన తీవ్ర గాయాలయ్యాయని.. తాము వెంటనే ఐకాన్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
కానీ ఇంతవరకు విద్యుత్ అధికారులు ఎవరూ తమ గురించి పట్టించుకోలేదని తెలపగ విద్యుత్ ఉన్నతాధికారులతో ఆయన ఫోన్లో . మాట్లాడారు అధికారుల నిర్లక్ష్య పట్ల తన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు... కనీస మానవత్వం లేకుండా..తమ నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాల బాధ తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే విద్యుత్ అధికారులు బాధితుల చికిత్సకయ్యే ఖర్చులు భరించి వారికి.. విద్యుత్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు. ఆయన వెంట నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం, మాజీ సర్పంచ్ రాము,బీరం గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.