calender_icon.png 22 July, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 నుంచి అచ్చంపేటలో మెగా సర్జికల్ క్యాంపు

22-07-2025 12:00:00 AM

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

నాగర్ కర్నూల్ జులై 21 (విజయక్రాంతి): నిరుపేదలకు ఉచిత కార్పొరేటర్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో వచ్చేనెల 6 నుండి అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో మూడవ మెగా సర్జికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం ఏరియా ఆసుపత్రిలోని అన్ని వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి వైద్యులతో మాట్లాడారు.

గతంలో ఏర్పాటు చేసిన మొదటి సర్జికల్ క్యాంపులో సుమారు 762 మంది నిరుపేదలు వైద్యం పొందారని రెండో సర్జికల్ క్యాంపులో 420 మంది హెర్నియా, కనితి, ఫిస్టులా, డెలివరీ ఇతర ఎముకల సంబంధించిన ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు. మూడో సర్జికల్ క్యాంపును వచ్చేనెల 6న ఏరియా ఆసుపత్రిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ముందస్తుగా సమస్యలు ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలనిసూచించారు.