calender_icon.png 22 July, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉండాలి

22-07-2025 12:00:00 AM

ప్రముఖ పండితులు నారాయణ శర్మ

కామారెడ్డి, జూలై 21 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖ పండి తులు నారాయణ శర్మ అన్నారు. సోమ వారం కామారెడ్డి టీఎన్జీవోస్ ఉద్యోగులు నారాయణ శర్మ జన్మదినం సందర్భంగా సన్మానించి అభినందించారు.

ఈ సంద ర్భంగా నారాయణ శర్మ కు అతని కుమా రుడు ఆంజనేయ శర్మ  టీఎన్జీవోస్ కామా రెడ్డి జిల్లా శాఖ తరఫున సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు జిల్లా  టీఎన్జీవోస్  అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి తెలిపారు.

జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన వారి  బృందం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ వేద పండితులు అయినటువంటి తండ్రి, కొడుకులు నారాయణ శర్మ , ఆంజనేయ శర్మల  జన్మదినం పురస్కరించుకొని వారిని జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ లోని సంకష్ట హర గణపతి దేవాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి  శాలువాతో సత్కరించి పూల మాలను వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం ఆంజనేయ శర్మ  అర్చన చేసి కామారెడ్డి జిల్లా ఉద్యోగులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారికి ఆ భగవంతుని కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని  ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో  టి ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు, అర్బన్ తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.