10-05-2025 11:05:26 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని, తూకం సరిగా వేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. లింగంపేట్ మండలం కోమటిపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు,టార్పాలిన్,తదితర ఏర్పాట్లు చేయాలని అన్నారు. భూ భారతి డెస్క్ వర్క్ నిర్వహించాలి అదనపు కలెక్టర్.. భూ భారతి సర్వే కు సంబంధించిన డెస్క్ వర్క్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. లింగంపేట్ మండలం పోతాయిపల్లి, నల్లమడుగు గ్రామాల్లో డెస్క్ వర్క్ లను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.