10-05-2025 11:10:36 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం శనివారం మొండికుంటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారత్ పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పోడియం బాలరాజు పాల్గొని మాట్లాడుతూ... మండలంలోని పార్టీ క్రియాశీలక సభ్యులందరూ పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను వేసి, మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన కల్లాలలో దాన్యం తడిసి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తడిసిన ధాన్యాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వము వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పహాల్గంలో జరిగిన ఉగ్రదాడికి జవాబుగా త్రివిధ దళాల సారథ్యంలో ఆపరేషన్ సింధూరం పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చి పాకిస్తాన్ కు భారత ప్రభుత్వం దీటైన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోది కి, ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వివిధ దళాల అధికారులకు ,సైనికులకు అభినందనలు తెలియజేశారు. తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు పాక్ పై జరుగుతున్న యుద్ధంలో భారత ప్రభుత్వానికి ,సైనికులకు ప్రతి పౌరుడు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు తాటిపాముల ఐలయ్య, సురగంటి లింగారెడ్డి ,కల్లూరి రామారావు, మండల నాయకులు సున్నం సారయ్య ,కోలా భాస్కర్, కొల్లులింగారెడ్డి, గోసుల రాములు, ఆసా శ్రీనివాసరావు, బూత్ అధ్యక్షులు పగడాల కృష్ణారెడ్డి, పసునూరి సురేష్, కడమంచి రాజేష్, పోతోజు మురళి తదితరులు పాల్గొన్నారు.