calender_icon.png 2 September, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమీలు అమలు చేయలేక ఆరోపణలు

02-09-2025 12:08:44 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్

మంచిర్యాల, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమై బీఆర్‌ఎస్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీసుకుంటూ వస్తుం దని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ న్ అన్నారు. సోమవారం మాజీ ఎంఎల్‌ఏ నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు, డిక్లరేషన్ లు అమలు చేయలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, పార్టీపై లేనిపోని కథలు అల్లుతుందని, ఎన్నికల సమయంలో ఏదో సాకు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు.

ఒక సారి కాళేశ్వరం, మరోసారి లిక్కర్ స్కాం, ప్రస్తుతం సీబీఐ పేరిట రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. సీబీఐ, ఈడీలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి ఎలా సీబీఐకి కేసు అప్పగించారని ప్రశ్నించారు. బీజేపీ మోదీ ఆదేశాలతోనే కాంగ్రెస్ రేవంత్ పని చేస్తున్నారని, గోదావరి నీటిని ముఖ్యమంత్రి పాత గురువు, కొత్త గురువులకు తరలించేందుకే కాళేశ్వరం ప్రాజె క్టు మరమ్మతులు చేయించకుండా వారి కో సం పని చేస్తున్నారని విమర్శించారు. ప్రభు త్వం వైఫల్యాలను ఎండగట్టారు.

తెలంగాణ ప్రజలు ఇక కాంగ్రెస్, బీజేపీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టేందుకే యూరియా కొరత సృష్టిస్తుందని, ప్రజలు గమనిస్తున్నారని, తప్పక బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, బీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేశ్, గాదె సత్యం, అత్తి సరోజ, సురేందర్ రెడ్డి, తిరుపతి, సుబ్బయ్య పాల్గొన్నారు.