02-09-2025 01:04:54 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధ న కోసం వేలాది మంది తెలంగాణ ఆశా వర్క ర్లు కోసం సమరశంఖం పూరించారు. కనీస నెలసరి వేతనం రూ.18వేలుగా నిర్ణయించాల ని, పీఎఫ్, ఈఎస్‌ఐ, వేతనంతో కూడిన సెలవులు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా చేపట్టారు. రాష్ర్ట నలుమూలల నుంచి తరలివచ్చి సోమవారం హైద రాబాద్‌లోని కోఠిలోని ఆరోగ్య కమిషనర్ కా ర్యాలయాన్ని ముట్టడించారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే, రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను క్షేత్రస్థాయిలో అడ్డుకుంటామని, వాటికి బ్రేకులు వేస్తామని ఆశా కార్యకర్తలు తీవ్రంగా హెచ్చరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షు రాలు పి. జయలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం టార్గెట్లు పూర్తిచేయలేదనే సాకుతో మా ప్రోత్సాహకాలకు కోత పెడుతోందన్నారు.
ఇప్పుడు టార్గెట్లు మిస్ అయితే ఏకంగా ఉద్యోగంలోంచి తొలగించే విధానాన్ని ఆరోగ్య శాఖ అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేధిం పులు ఆపి, మాకు రూ.18 వేలు కనీస వేతనం నిర్ణయించాలి, అని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చా క మాట తప్పిందని మండిపడ్డారు.
జీపీఎస్ ట్రాకింగ్ విధానాలు, అసాధ్యమైన టార్గెట్లతో పనిభారాన్ని పెంచడం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించకపోవడం, ఆదివారాలు, జాతీయ సెలవు దినాల్లో వేతనంతో కూడిన సెలవులు ఇవ్వకపోవడం వంటి సమస్యలపై ఆశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.