16-11-2025 12:00:00 AM
బంజారహిల్స్‌లో ప్రారంభం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని జూమ్ టవర్ (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పైన)లో డొమెస్టిక్ గ్లాస్ తమ అత్యాధునిక షోరూంను ప్రారంభించింది. కంపెనీ డైరెక్టర్స్ అబ్దే అలీ, ముస్తఫా నేతృత్వంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం, నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగాలకు అంతర్జాతీయ స్థాయి గ్లాస్ పరిష్కారాలు అందించా లనే వారి లక్ష్యాన్ని బలోపేతం చేసింది.
ప్రముఖ సీనియర్ ఆర్కిటెక్ట్లు సునీల్ పిల్లై, మధు కాబ్రా, డొమెస్టిక్ గ్లాస్ మార్కెటింగ్ హెడ్ శ్రీహితరెడ్డి, అలాగే వారి కంపెనీ సభ్యులు, సన్నిహితులు కుటుంబాలతో సహా ఈ వేడుకకు హాజరయ్యారు. అతిథులకు ఫాసాడ్లు, స్లైడింగ్ డోర్లు, పార్టిషన్లు, రైలింగ్ సిస్టంలు వంటి అధునాతన ఇన్స్టాలేషన్లను ప్రదర్శించారు. గ్లోబల్ భాగస్వామ్య సంస్థలైన టెక్నల్, టెక్నోరైల్, కాన్వాస్ ఉత్పత్తులను కూడా ప్రదర్శించారు.
అబ్దే అలీ మాట్లాడుతూ.. ‘మా దృష్టికి ఈ షోరూమ్ అద్దం వంటిది. కస్టమర్లు, డిజైనర్లు గ్లాస్ను సృజనాత్మకంగా, వినియోగాత్మకంగా ఎలా ఉపయోగించవచ్చో అనుభవించడానికి ఇది ఒక కేంద్రం’ అని తెలిపారు. సహవ్యవస్థాపకుడు ముస్తఫా మాట్లాడుతూ.. ‘మా భాగ స్వామ్యాల ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల డిజైన్-ఆధారిత సిస్టమ్లను హైదరా బాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకువస్తున్నాం’ అని స్పష్టం చేశారు.