12 May, 2026 | 11:15 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

17-09-2025 02:17 AM
  1. నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజం మార్పు
  2. సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 16 (విజయక్రాంతి)వివరాల మేరకు.జూలపెల్లి మండ లం తెలీకుంటకు చెందిన మరిపెల్లి రాజయ్య s/o మల్లయ్య age 64y అనే వ్యక్తి వేములవాడశివారులో మామిడితోటలో తోట కాపరిగా పని చేసుకుంటూన్నాడు,అతనితో పాటు మంత్రి ఆనందం S/o నర్సయ్య, r/o చింతల్ ఠాణా కూడా తోటలో తోటకాపరిగా పనిచేస్తున్నాడు,పని విషయంలో రాజ య్య .

ఆనందం మధ్య ఎప్పుడు గొడవ జరిగేది, తోటపని. వంటపని రాజయ్య ఒక్కడే చేసేవాడు, ఇట్టి విషయంలో రాజయ్య ఆనందంను. తిట్టేవాడు, రాజయ్య. తిడుతున్న విష యం ఆనందం మనుసులో పెట్టుకొని. రాజయ్యను చంపాలానే ఉద్దేశ్యంతో తేదీ 29/ 04/2024 రోజున రాత్రి రాజయ్య రూమ్ బయట తింటున్న సమయంలో ఆనందం అప్పటికే రెడీగా పెట్టికున్న ఇనుపపారాతో రాజయ్య తల పై భాది చంపాడు.

ఈకేసులో రాజయ్య కొడుకు అయినటువంటి శ్రీనివాస్. ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్. కేసు నమోదు చేసి నిందితుడు రిమాండ్ కు పంపించడం జరిగింది.తరువాత సిఐ వీరప్రసాద్ కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.

కోర్టు మానిటరింగ్ ఎస్త్స్ర రవీంద్ర నాయుడు. ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ మహేందర్,   సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 16 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్. వాదించారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన. న్యాయమూర్తి నేరం రుజువు, కావడంతో నిందితుడైన ఆనందం కు జీవిత ఖైదీతో పాటు1000/- రూపాయల. జరిమానా విధించడం జరిగింది. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన. వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే స మాజంలో మార్పు వ స్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూష న్ వారు వ్యూహంతో న్యాయ విచారణ. న్యా య నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడే లా చేస్తారని సూచించారు.పైకేసులో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన విచారణ అధికారి సీఐ వీరప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, కోర్టు మానిటరింగ్ ఎస్త్స్ర రవీంద్ర నాయు డు, కోర్టు కానిస్టేబుల్ మహేందర్,సి ఎం ఎ స్ కానిస్టేబుల్ నవీన్‌ల ను జిల్లా ఎస్పీఅభినందించారు.