12 May, 2026 | 9:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఆర్టీఐ చట్టం

17-09-2025 02:15 AM
  1. ప్రధాన కమిషనర్ డా. చంద్రశేఖర్ రెడ్డి

ఆర్టీఐపై అధికారులు సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 134 కేసుల పరిష్కారం

రాజన్న సిరిసిల్ల:సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) జిల్లాలో సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) 2005 ను అధికారులు కట్టుదిట్టం గా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టం పై మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆర్టీఐ క మిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస రావు, అయోధ్య రెడ్డి, మెహసిన పర్వీన్ లతో కలిసి పాల్గోన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమాచా ర హక్కు చట్టంలో గత కొన్ని రొజులుగా నిర్లిప్తత ఏర్పడినట్లు భావం అందరిలో వచ్చిం దని, రెండు సంవత్సరాల పాటు ఆర్టిఐ కమిషనర్ నియామకం కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు.పెండింగ్ కేసులను త్వరగా పరి ష్కారం చేయడంతో పాటు అధికారులలో ఉన్న నిర్లక్ష్యం తొలగించాలనే ఉద్దేశంతో జిల్లాల పర్యటన చేపట్టామని, ఆర్టిఐ చట్టంపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించామని అన్నారు.

ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ప్రజా సమాచార అధికారి, మొదటి అ ప్పిలేట్ అథారటి, రెండవ అప్పిలేట్ అథారి టీ పేర్లు, ఫోన్ నెంబర్ లతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్యుడు చేతిలో వజ్రాయుధం ఆర్టిఐ చట్టం అని అన్నారు. సమాజంలో వాచ్ డాగ్ లా గా సమాచార హక్కు చట్టం పని చేస్తుందని తెలిపారు. ప్రజలు సమాచారం అధికంగా తెలుసుకోవడం వల్ల జరిగే మోసాల నుంచి తప్పించుకోవచ్చని, అధికారులు ఎవరికి భ యపడకుండా ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందించాలన్నారు.

జిల్లా అధికారులు సమాచార హక్కు చట్టాన్ని తప్పనిసరిగా పాటిస్తూ పారదర్శకంగా అమ లు చేయాలని అన్నారు.ఆర్టిఐ చట్టం ప్రజల్లో తీసుకుని వెళ్ళెందుకు వారదులుగా ప్రభుత్వ అధికారులు సిబ్బంది పని చేయాలని అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాచారం అడిగే హక్కు కల్పించిన వజ్రా యుధం ఆర్టిఐ చట్టం అని అన్నారు. ప్రతి ప్ర జా సమాచార అధికారి. ఆర్.టి.ఐ. చట్టం పై సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలని అన్నా రు. రెండు సంవత్సరాల పైగా ఆర్టిఐ కమిషన్ లేని కారణంగా సుమారు 15000 పై గా కేసులు పెండింగ్ ఉన్నాయని.

అన్నారు. ప్రస్తుతం పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆర్టిఐ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తగు వేగవంతమై న చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభు త్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ తో పాటు సెక్షన్ 4 (1) (b) వివరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని, అటువంటి అంశాలను అధికారుల దృష్టికి తీసు కుని వస్తున్నామని అన్నారు. సెక్షన్ 81(j) ప్రకారం వ్యక్తిగత సమాచారం మాత్రమే ఇ వ్వవద్దని, దీనిని దుర్వినియోగం చేయవద్దని అన్నారు. 

ఆర్టిఐ చట్టం అమలులో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానానికి చేరు కోవాలని మన దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమంగా సమాచార హక్కు చట్టం అమ లు చేసే దిశగా ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం సమాచార హక్కు చట్టం సంబంధించి జిల్లా లో పెండింగ్ ఉన్న 134 కేసులను కమిషన్ సభ్యులు జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో పరిశీలించి పరిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల. వేము లవాడ అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రిని రెడ్డి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబా యి జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఫస్ట్ అప్పిలేట్ అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.