అంధ విద్యార్థులకు సంగీత పరికరాలు
పంపిణీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): అంధ విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సంగీత వాయిద్య పరికరాలను మంగళవారం పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, విద్యార్థులు కలిశారు. సీఎం ఎదుట విద్యార్థులు పాట పాడి వినిపించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పాటల సీడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్, మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, కలెక్టర్ పమేల సత్పతి పాల్గొన్నారు.
సీఎంకు రాహుల్ కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైలు ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రాహుల్ గతేడాది నంబర్ 2న రాజస్థాన్ వెళ్తుండగా.. కొందరు దుండగులు రైలు నుంచి తోసేయడంతో రెండు కాళ్లు కోల్పోయాడు. రాహుల్‌కు కృత్రిమ కాళ్లు అమర్చేందుకు సీఎం సహాయ నిధి నుంచి సాయం అందజేశారు. తనకు మళ్లీ నడిచేందుకు సహకారం అందించిన సీఎం రేవంత్‌రెడ్డిని రాహుల్ కలిసి ధన్యవాదాలు తెలిపారు.






