calender_icon.png 25 October, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగిక దాడి కేసులో నిందితుడికి 21ఏళ్ల జైలు

25-10-2025 12:12:26 AM

-రూ.10 లక్షల జరిమానా

-తీర్పు చెప్పిన జిల్లా పొక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి

నల్లగొండ కైమ్, అక్టోబర్ 24(విజయక్రాంతి): సోదరిని గర్భవతి చేసిన వ్యక్తికి 21 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా పొక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి రోజారమణి శుక్రవారం తీర్పునిచ్చారు. కట్టంగూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన సొంత పెద్దమ్మ కూతురిని ఏడు నెలల గర్భవతిని చేసిన సంఘ టనలోనల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 జూన్ 2021న కేసు నమోదైంది. నల్లగొండ పట్టణంలోని బొట్టుగూ డకు చెందిన చింతపల్లి నగేష్ ఆ బాలికను మూ డు రోజులు బొట్టుగూడలో ఉంచి లైంగిక దాడి చేసినట్లు రుజువైంది. నిందితుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడికి రూ.30 వేల  జరిమానా బాధి తురాలికి రూ.10 లక్షల పరిహారం, ఇవ్వాలని కోర్టు తుది తీర్పు వెల్లడించింది.