25-10-2025 12:10:47 AM
జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం ఒక సంవత్సరం కాలానికి నిర్వహించగా కొబ్బరికాయల విక్రయాలను తీగుల్ నర్సాపూర్ కు చెందిన కిషన్ రూ.23లక్షల10వేలకు దక్కించుకోగా, కొబ్బరికాయల వక్కల సేకరణను రూ.7 లక్షల 90వేలకు బస్వరాజ్ దక్కించుకున్నారు. అమ్మవారి ఒడి బియ్యం సేకరణను వేలం పాట ద్వారా రూ. 25లక్షల70వేలకు మహేష్, రూ. 30 లక్షల20వేలకు లడ్డు విక్రయాలను శ్రీకర్ రెడ్డి దక్కిచుకున్నారు. గుర్వన్నపేటకు చెందిన నవీన్ పూల దండల విక్రయాలను రూ. 2లక్షలకు ఛేజిక్కించుకున్నారు.ఈ సందర్బంగా ఆలయ ఈఓ రవి కుమార్ మాట్లాడుతూ బహిరంగ వేలం మొత్తం రూ. 88,90000 వేల రూపాయలు ఆలయ బ్యాంకు ఖాతా లో జమ చేసి దేవాదాయ శాఖ అనుమతులతో ఆలయ అభివృద్ధి కి ఉపయోగిస్తామని తెలిపారు.