31-10-2025 12:00:00 AM
 
							తీసుకున్న అప్పు చెల్లించాలని తీర్పు
ఎల్‌బీనగర్, అక్టోబర్ 30(విజయక్రాంతి) : అప్పు చెల్లిస్తామని ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో నిందితుడి రెండేళ్ల జైలుశిక్ష తోపాటు తీసుకున్న అప్పు చెల్లించాలని ఎల్‌బీ నగర్‌లోని జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపిక నాగశ్రావ్య తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. వుప్పల వెంకయ్య తండ్రి మల్ల య్య సరూర్‌నగర్‌లోని శ్రీనివాస్ కాలనీలో నివాసముంటున్నాడు. ఎల్‌బీ నగర్‌లో ని చంద్రపురి కాలనీలో నివాసముంటున్న వ్యా పారి చందా శ్రీనివాసులు తండ్రి సత్యనారాయణ(48)కి వ్యక్తిగత అప్పుగా మొత్తం రూ 38 లక్షలను వెంకటయ్య ఇచ్చాడు.
కాగా అప్పు ఇవ్వాలని శ్రీనివాసులుపై వెంకటయ్య ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో అప్పు చెల్లిస్తానని శ్రీనివాసులు బ్యాంకు చెక్కులు ఇచ్చా డు. చెక్కులను బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యాయని వెంకటయ్య కోర్టులో కేసు వేశాడు. ఈ కేసును ఈ ఏడాది జులై 2వ తేదీన ఎల్‌బీనగర్ లోని ఐదో అదనపు కోర్టు న్యాయమూర్తి స్వీకరించారు.
వాదనలు పూర్తయిన తర్వాత గురువారం తీర్పు ఇచ్చా రు. నిందితుడు శ్రీనివాసులుకు రెండు సం వత్సరాల పాటు సాధారణ జైలుశిక్ష విధించారు. దీంతో పాటు తీసుకున్న అప్పు రూ. 38 లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అప్పు మొత్తాన్ని చెల్లించకుంటే నిందితుడు ఆరు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.