calender_icon.png 31 October, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగికదాడి కేసులో నిందితుడి రిమాండ్

31-10-2025 12:00:00 AM

ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి

కామారెడ్డి, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): మహిళను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ కార్యాలయం లో గురువారం ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా కు వివరాలను వెల్లడించారు.  పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఈనెల 26న అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అదే గ్రామ శివారులో ఉన్న రైస్‌మిల్లులో పనిచేసే బీహార్ కార్మికుడు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. అత్యాచారానికి గురైన మహిళను స్థాని కులు గుర్తించి ఆమెను చికిత్స నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితున్ని పట్టుకోవడం కో సం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సదరు నిందితుడిని గురువారం మహారాష్ట్రలోని గొండ్యా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు పనిచేసిన రైస్‌మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని ఘటన జరిగిన రోజు బాధితురాలి తరపున పలువురు ధర్నాకు దిగారు.