31-10-2025 12:00:00 AM
-విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులు కరువు
-ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు కరువు
-చిత్ర విచిత్రంగా ప్రభుత్వ పాఠశాలలు తీరు
-విద్యార్థులపై ప్రైవేటు పాఠశాలల గురి
జుక్కల్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలు పేద ప్రజలకు విద్యనందించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్న మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు, మరోవైపు పాలకులు పట్టించుకోవడం లేదు. ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రవేట్ కార్పొరేట్ పాఠశాల లకు దీటుగా తీర్చిదిద్ది విద్య బోధనలను పేద విద్యార్థులకు అందిస్తామని ఒకవైపు గొప్పలు చెబుతున్న ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చిత్ర విచిత్రంగా పరిస్థితిలు కనిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు లేరు మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి ఇలాంటి విషయాలు మరెన్నో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ముగ్గురే విద్యార్థులు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గురువారం విజయ క్రాంతి పాఠశాలలను పరిశీలించగా ఈ విషయం తెలియ వచ్చింది.
పాఠశాల రిజిస్టర్లు కూడా ముగ్గురు విద్యార్థులు అని ఉన్నట్లు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురికి ప్రత్యేక పాఠశాల ఏంటి అని ప్రశ్నించగా ఆయన మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఆటోలు పెట్టి మరీ గ్రామాల్లో నుంచి విద్యార్థులను తీసుకువెళుతున్నట్లు పేర్కొన్నారు. తమ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండగా కొందరు తల్లిదండ్రులు ప్రైవేట్ లు చేర్పించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముగ్గురి కోసం మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వారు ఏ విధంగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారని ప్రశ్నించగా అది ఏజెన్సీ వాళ్ళ ఇష్టమని అన్నారు. విద్యార్థులు ఎందరు ఉన్న తమ డ్యూటీ తాము చేసుకుంటామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గుండూర్ ప్రభుత్వ పాఠశాలలో 29 మంది విద్యార్థులు ఉండగా అక్కడ ఒకే ఉపాధ్యాయిని విధులు నిర్వహిస్తోంది. ఆ పాఠశాలలో మరొక ఉపాధ్యాయుడి అవసరం ఉంది. ఇక్కడ గత జూన్ లోనే ఒక టీచర్ రిటైర్మెంట్ అయినట్లు ఆమె పేర్కొన్నారు. ఉన్న పోస్టుకు ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఎవరు ముందుకు రాలేదని ప్రస్తుతం ఒక టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ఆమె చెప్పారు. మండలంలో కొన్ని సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. జుక్కల్ మండలం తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్లో ఉండడంతో ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. చండేగాం, మాదాపూర్ గ్రామాల్లో విద్యార్థులు ఎక్కువగా మరాఠీ మాట్లాడడంతో వారికి తెలుగు నేర్పడం కష్టంగా ఉన్నట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు.
అదేవిధంగా సోపూర్ గ్రామంలో కన్నడ భాష వాడుకలో ఉండడంతో అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే ఉపాధ్యాయులకు నెల జీతం వస్తోంది కానీ వారికి తెలుగు నేర్పడం వారు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పైన పేర్కొన్న గ్రామాల్లో కూడా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో లేరు. ప్రైవేటు పాఠశాల యజమానులు బస్సులు, ఆటోలు, డీసీఎంలు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పించి తమ స్కూల్లో చేర్చుకుంటున్నారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఈ విధంగా అ నేక పాఠశాలలో అనేక విద్యార్థుల సంఖ్య త గ్గినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. సం బంధిత అధికారులు విద్యార్థుల సంఖ్య పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంద ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.