calender_icon.png 29 December, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరారీలో హాదీ హత్య కేసు నిందితులు

29-12-2025 01:02:21 AM

ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల ప్రకటన

భారత్‌కు చేరుకున్నట్లు స్పష్టీకరణ

ఢాకా, డిసెంబర్ 28 : బంగ్లాదేశ్ కుదిపేసిన విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ బి న్ హాదీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత్‌కు పారిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఢాకా మెట్రోపాలి టన్ పోలీసులు (డీఎంపీ) ఆదివారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితులు ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్‌లు మే ఘాలయలోని తురా నగరంలో తలదాచుకున్నట్లు గుర్తించామని అదనపు పోలీస్ కమిష నర్ నజ్రుల్ ఇస్లాం తెలిపారు.

సహచరుల సాయంతో వారు హలువాఘాట్ సరిహద్దు ద్వారా మేఘాలయలోకి ప్రవేశించారని వివరించారు. అక్కడ వారికి ’పూర్తీ, ’సమి’ అనే ఇద్దరు వ్యక్తులు ఆశ్రయం కల్పించారని, వా రిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు తమకు అనధికారిక సమాచారం ఉందని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని  భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ హత్య కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశామని, వారిలో ఆరుగురు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. మరో 7 నుంచి 10 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. 

బంగ్లాదేశ్‌వి నిరాధార ఆరోపణలు

బీఎస్‌ఎఫ్, మేఘాలయ పోలీసులు

అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌కు ఎవరూ రాలేదని బీఎస్‌ఎఫ్ అధికారులు, మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బంగ్లాదేశ్ నిరాధార ఆరోపణలు చేస్తోందని కొట్టిపారేశారు. బంగ్లాదేశ్ విద్యార్థినేత హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా ఉ న్న ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్ భారత్‌కు పారిపోయినట్లు ఢాకా మెట్రోపాలిటిన్ పోలీసుల ప్రకటనను బీఎస్‌ఎ ఫ్, మేఘాలయ పోలీసులు ఖండించారు. ఎవరూ రాష్ట్రంలోకి రాలేదని తాము ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ భారత ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు బంగ్లాదేశ్ మీడియా కల్పిత కథనాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.