18-04-2025 12:00:00 AM
రూ.30 వేలు జరిమానా
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 17 : పోక్సో కేసులో ఓ నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ గురువారం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఫోక్స్ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిభట్ల పోలీసులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి పటేల్ గూడ గ్రామానిక్ చెందిన జంగం నరేందర్ అనే వ్యక్తి ఓ బాలికపై అఘాయిత్యం చేయడానికి యత్నించిన విషయం గమనించిన స్థానికులు, గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. కాగా కుటుంబ సభ్యు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.